రజనీకి తేడా క్యారెక్టర్ కావాలట

సూపర్ స్టార్ రజనీకాంత్ 167 సినిమాలని పూర్తి చేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలని పోషించారు. ఐతే, ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించాలని ఉందని రజనీ తన కోరికని బయటపెట్టారు. రజనీ 167వ చిత్రం ‘దర్భార్’ ఏఆర్ రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న దర్భార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం దర్బార్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రజనీ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. అందులో చాలా సీరియ‌స్‌నెస్ ఉంటుంది. క్రిమిన‌ల్స్ వెంట ప‌రిగెత్తాలి. అందుకే ఇలాంటి పాత్ర‌ల‌లో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంద‌ని ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు. తాను ఇప్పటివరకూ ట్రాన్స్‌జండర్ క్యారెక్టర్ చేయలేదని, అటువంటి పాత్ర పోషించాలనుకుంటున్నానని రజనీ తెలిపారు.

ఇక శివ దర్శకత్వంలో రజనీ 168 సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కనిపించనున్నారు. రజనీ సినిమా కోసం కీర్తు సురేష్ మణిరత్నం మల్టీస్టారర్ లో నటించే అవకాశాన్ని వదులుకొన్నట్టు చెబుతున్నారు.