ప్రభాస్ హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమాలో రొమాన్స్ చేసింది ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ్. హీరోయిన్ గా బిజీకాలేకపోయిన రిచా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ యేడాది జనవరి 6న అమెరికా ప్రియుడుజోతో నిశ్చితార్థం చేసుకొంది. తాజాగా రిచా-జోతో వివాహం ఘనంగా జరింది.
భారతీయ హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి నిర్వహించారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల వారు, బంధుమిత్రులు హాజరయ్యారు. టాలీవుడ్ సినీ ప్రముఖులెవ్వరు రిచా పెళ్లికి హాజరుకానట్టు తెలుస్తోంది. త్వరలోనే సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం రిచా గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగులో లీడర్, మిరపాకయ్, మిర్చి సినిమాల్లో రిచా నటించింది. తమిళ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన రిచా బిజీ హీరోయిన్ కాలేకపోయింది.