‘రూలర్’ మేకింగ్ వీడియో చూశారా.. ?

సీనియ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. భూమిక కీల‌క పాత్రలో నటించారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. సి. కల్యాణ్ నిర్మించారు. ఈ వారమే (డిసెంబర్ 20) రూలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రూలర్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. బాలయ్య డిఫరెంట్ లుక్ లో కనిపించడం మేకింగ్ వీడియో చూడొచ్చు. ఇందులో యాక్షన్ ని హైలైట్ చేస్తూ చూపించారు. బాలయ్య స్టెప్పులు, యాక్షన్.. చిత్రబృందం హార్ట్ వర్క్  మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నాయి. రూలర్ మేకింగ్ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !