3 రాజధానుల ప్రతిపాదనలపై రైతుల ఆందోళన

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కొనసాగుతున్న గందరగోళాననికి సీఎం జగన్ తెరదించిన సంగతి తెలిసిందే. ఏపీలో మూడు రాజధానాలు ఏర్పాటు కాబోతున్నాయని మంగళవారంలో అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం జగన్. అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలో హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై రాయలసీమ, విశాఖ వాసుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

ఐతే, సీఎం జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. తాజాగా అమరావతి రైతులు భారీగా రాజధాని ప్రాంతానికి చేరుకొని నిరసలు తెలుపుతున్నారు. మహిళా రైతులు పురుగుల మందు డబ్బాలతో వచ్చి.. రోడ్లపై బైఠాయించారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, సీఎం జగన్ నిర్ణయాన్ని మద్దతుతు తెలుపుతున్న రైతులు.. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరుగుతుంది. ప్రస్తుతం అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.