‘సైరా’ జీఎస్టీ టాక్స్ ఎంతో తెలుసా ?
భారీ బడ్జెట్ చిత్రాలు అంతే భారీ మొత్తాన్ని జీఎస్టీ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఐతే, చారిత్రాత్మక చిత్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపుని ఇస్తుంటాయి. బాలయ్య వందో సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి రెండు తెలుగు రాష్ట్రాలు టాక్స్ మినహాయింపుని ఇచ్చాయి. అదే.. గుణశేకర్ తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రానికి ఏపీ ప్రభుత్వం టాక్స్ మినహాయింపుని ఇవ్వలేదు. దీనిపై గుణశేఖర్ పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రానికి టాక్స్ మినహాయింపు లభించలేదు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 20కోట్ల జీఎస్టీ టాక్స్ కట్టారట. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సైరాకు ఆ మొత్తంలో జీఎస్టీ టాక్స్ పడినట్టు సమాచారమ్. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన సైరా.. ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫైనల్ గా నష్టాలనే మిగిల్చింది. ఆ నష్టాల లెక్కెంత ? అనేది మాత్రం తెలియరాలేదు.
సైరా చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాతల్లో నటించారు అమిత్ త్రివేది సంగీతం అందించారు.