విశాఖ వన్డే : రోహిత్, రాహుల్ సెంచరీలు
విశాఖ వన్డేలో టీమిండియా ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ (110, 115బంతుల్లో), కె ఎల్ రాహుల్ (101, 102బంతుల్లో) సెంచరీలతో చెలరేగారు. దీంతో టీమిండియా 36.2ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 221 పరుగులు చేసింది. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ.
టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కడంతో.. భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది. వీరి జోరు ఇలాగే కొనసాగితే.. భారత్ స్కోరు బోర్డ్ 350దాటొచ్చు.