విశాఖ వన్డే : టీమిండియా 61/0 (11 ఓవర్లు)

విశాఖ వన్డేలోనూ టీమిండియా తొలి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 25 (36 బంతుల్లో), కెఎల్ రాహుల్ 38 (35 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు.

ఈ మ్యాచ్ కోసం ఆల్‌ రౌండర్‌ శివమ్‌ దూబేని పక్కన పెట్టారు. ఆయన స్థానంలో పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ని తీసుకున్నారు. మూడు మ్యాచ్ సిరీస్ లో తొలి వన్ డే గెలిచిన విండీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. విశాక వన్ డే లో విజయం సాధించింది సిరీస్ ని 1-1తో సమం చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది.