మా అమ్మే నాన్నను చంపేసింది : హీరోయిన్


హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్లీస్‌ థెరోన్‌ షాకింగ్ విషయాలని పంచుకొంది. మా అమ్మే నాన్నను చంపేసిందిని తెలిపింది. ఆత్మరక్షణ కోసమే అమ్మ ఆ పని చేసిందని చెప్పుకొచ్చింది. నా తండ్రి మద్యానికి బానిస. చాలా బలహీనమైన వ్యక్తి. నా చిన్నతనం నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఆయన అలానే ఉన్నాడు. మాకు జీవితంపై ఆశలు చచ్చిపోయాయి. ఆయన వల్ల మా కుటుంబం దీనస్థితిలో కూరుకుపోయింది.

 ఓరోజు మా నాన్న బాగా మద్యం సేవించాడు. నడవలేని పరిస్థితిలో చేతిలో తుపాకీ పట్టుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ, నాపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. ఒక్క బులెట్‌ కూడా మాకు తగల్లేదు. చివరికి ఆత్మరక్షణ కోసం అమ్మ నాన్నను చంపేసింది. ఇలాంటి సమస్యలు అనేక మంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ఘటనను నేను చాలా మందితో పంచుకున్నాని మీడియా సమావేశంలో తెలిపింది.