అలీ తల్లికి నివాళులు అర్పించిన చిరు
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. జైతున్ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ తరలించారు. ఈ సాయంత్రం హైదరాబాద్ లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి అలీ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. అలీ ఆయన కుటుంబ సభ్యులకి సంతాపం తెలిపారు
అలీ వివిధ సందర్భాల్లో తల్లి మీద తనకున్న ప్రేమని గుర్తు చేసుకునేవారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తల్లితండ్రులే కారణమని చెప్తుంటారు. ఇక మెగాస్టార్ ఫ్యామిలీతో అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాల్లో అలీ నటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అలీ అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే.
Chiranjeevi offers condolences to #Ali and his family on the demise of Ali's mother. pic.twitter.com/czzaRtZSsY
— BARaju (@baraju_SuperHit) December 19, 2019