‘సీఏఏ’పై సీఎం కేసీఆర్ స్టాండ్ ఏంటీ ?
‘సీఏఏ’పై సీఎం కేసీఆర్ స్టాండ్ ఏంటీ ? పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టానికి వ్యతిరేకంగా వామపక్షాలు దేశ వ్యాప్తంగా నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ర్యాలీగా బయల్దేరేందుకు ప్రయతించారు. ఐతే, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదని.. అనుపతి లేనిదే ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
ర్యాలీకి వచ్చిన విద్యార్థులనే కాదు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలని పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం. ఇక పౌరసత్వంపై ఆందోళన చేస్తే.. కేసీఆర్ అణచివేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలో నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. మమత బెనర్జీలాగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ ఆందోళన చేయాలని… పౌరసత్వం అమలు చేయబోమని కేసీఆర్ ప్రకటించాలని నారాయణ డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రం తీసుకొచిన సీఏఏ ని వ్యతిరేకిస్తున్నారు. తమ రాష్ట్రంలో సీఏఏ ని అమలు చేయబోమని తేల్చి చెప్పారు. సీఎం మమతా బెనర్జీ ఏకంగా సీసీఏ కి వ్వతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మరీ.. సీఏఏపై సీఎం కేసీఆర్ స్టాండ్ ఏంటీ ? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలని సీఎం కేసీఆర్ వ్యతిరేకించలేదు. ఈ క్రమంలో సీఏఏపై కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకతని తెలియజేసేలా లేదని చెప్పవచ్చు.