ముస్లింలకు అనేక దేశాలు.. మరీ హిందువులకు ?

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు. వారికి కొన్ని కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో సీఏఏపై దేశంలో ఆందోళనలు ఉదృతం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

ముస్లింలకు అనేక దేశాలున్నాయని, హిందువులకు ఒక్క దేశం కూడా లేదని గడ్కరీ అన్నారు. గతంలో నేపాల్‌ ఒక్కటే హిందూ దేశంగా ఉండేదని.. మరి హిందువులు, సిక్కులు ఎక్కడకు వెళతారని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు అనేక ముస్లిం దేశాలు ఉండటం వల్ల వారికి అక్కడ పౌరసత్వం లభిస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లనుంచి 2014 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌కు వలస వచ్చి స్థిరపడిన హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడం లక్ష్యంగా సిఎఎ ప్రవేశపెట్టినట్లు కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలోని ముస్లింలు ఎవరు భయపడాల్సిన పనిలేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.