దబాంగ్3 : సల్మాన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ చూశారా ?

చుల్ బుల్ పాండే అనే ఓ వైవిధ్యమైన పోలీస్ పాత్రలో సల్మాన్ అదరగొట్టేశాడు. అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో 2010లో వచ్చిన సల్మాన్ ‘దబాంగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘దబాంగ్ 2’ కూడా వచ్చింది యావరేజ్ అనిపించుకొంది. ఇప్పుడీ సిరీస్ లో మూడో పార్ట్’గా దబాంగ్ 3 తెరకెకెక్కింది.
 
ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.సోనాక్షి సిన్హా హీరోయిన్. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటించారు. టాలీవుడ్  కమెడియన్ అలీ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య దబాంగ్ 3 ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దబాంగ్ 3 రిలీజ్ నేపథ్యంలో సల్మాన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

గురువారం రాత్రి నుంచే థియేటర్స్ దగ్గర భారీ బ్యానర్స్, కటౌట్స్ ఏర్పాటు చేశారు. బైక్ ర్యాలీలు, బ్యాండ్, బరాత్ లతో అదరగొట్టేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా టాక్ విషయానికొస్తే.. దబాంగ్ 3 అదిరిపోయిందని చెబుతున్నారు. చుల్ బుల్ పాండే గా సల్మాన్ చేసిన హంగామా ప్రేక్షకులకి కిక్కునిచ్చేలా ఉందని చెబుతున్నారు. దబాంగ్ 3కి ఏకంగా 4 రేటింగ్స్ ఇస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని తేల్చేస్తున్నారు.