‘ప్రతిరోజూ పండగే’ ట్విట్టర్ రివ్యూ

అపజయాలు చూసినోడికి విజయం విలువ తెలుస్తుంది అంటారు. మెగా యంగ్ హీరో సాయి తేజు వరుస ప్లాపులని చవి చూశాడు. ‘చిత్రలహరి’తో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు. మరో హిట్ కోసం పండగలాంటి కథని ఎంచుకొన్నాడు. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయిక. గీతాఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

పండగ పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య పండగ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. దాంతో ట్విట్టర్ వేదికగా అభిమానులు పండగ సినిమా టాక్ ని పంచుకుంటున్నారు. ఆ టాక్ పై ఓ లుక్కేద్దాం పదండీ.. !

నిజంగానే పండగ లాంటి సినిమా. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని మారుతి అద్భుతంగా తెరకెక్కించాడు. కథ-కథనాలు రొటీన్ అనిపించినా.. నటీనటుల ఫర్ ఫామెన్స్ హైలైట్ అని చెబుతున్నారు. ముఖ్యంగా సాయితేజు నట అదిరిపోయింది. ఆయనకి తోడుగా సత్యరాజ్, రావు రమేష్, రాశీఖన్నా.. మిగితా నటీనటుల అద్భుతమైన నటనని కనబర్చారు. వినోదం, ఎమోషన్స్ పండిన కథ ఇదని.. చెబుతున్నారు. ఇటు ఫ్యామిలీ, అటు యూత్ ని ఆకట్టుకొనేలా పండగ సినిమా ఉంది.

తెరపై పాటలు చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇక తనదైన స్టయిల్ నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచారు థమన్ అని చెబుతున్నారు. మొత్తంగా పండగ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్  కి స్లో నేరేషన్ ఒక్కటే ఇబ్బంది కలిగిస్తుంటుంది. అయితే.. ఈ సినిమాలో బోరింగ్ సీన్స్ లేకుండా మారుతి చక్కగా తెరకెక్కించాడని చెబుతున్నారు. మొత్తానికి.. సాయితేజు ఖాతాలో మరో హిట్ పడినట్టేనని చెబుతున్నారు.