రివ్యూ : ప్రతిరోజూ పండగే
చిత్రం : ప్రతిరోజూ పండగే (2019)
నటీనటులు : సాయి తేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు
సంగీతం : థమన్
దర్శకత్వం : మారుతి
నిర్మాత : గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్
రిలీజ్ డేటు : డిసెంబర్ 20, 2019.
రేటింగ్ : 3.5/5
కాన్సెప్ట్ లని తీసుకొని కడుపుబ్బ నవ్వించే దర్శకుడు మారుతి. మతిమరుపు కాన్సెప్ట్ తో ‘భలే భలే మగాడివోయ్’ని తీసుకొచ్చాడు. హిట్ కొట్టాడు. అతి శుభ్రత కాన్సెప్ట్ తో ‘మహానుభావుడు’ని తీసుకొచ్చాడు. అదీ హిట్టే. అతి దయ కాన్సెప్ట్ తో వచ్చిన ‘బాబు బంగారం’ బాగానే నవ్వించాడు. ఈసారి మాత్రం మారుతి కాన్సెప్టులని పక్కనపెట్టేసి.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకొన్నారు. పండగలాంటి కథని రాసుకొన్నాడు. ఆయన దర్శకత్వంలో సాయితేజ్-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పండగ సినిమా ఎలా ఉంది ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
రఘురామయ్య (సత్య రాజ్)కు లంగ్ క్యాన్సర్. మరో ఐదు వారాల్లోనే మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకొని తాత రఘురామయ్య దగ్గరకి వస్తాడు మనవడు సాయితేజ్. ఈ ఐదు వారాల్లో తాతని సంతోషంగా ఉంచాలని అనుకుంటాడు. జీవితంలో ఇప్పటి వరకు చేయని, చేయాలని చేయలేకపనులని చేయిస్తూ ఆనందంగా ఉంచుతాడు. అంతేకాదు.. కుటుంబ సభ్యులందరినీ తాత ఇంటికి రప్పిస్తాడు. ఏంజెల్ ఆర్నా (రాశీఖన్నా)తో పెళ్లి అని చెప్పి.. అందరినీ రప్పిస్తాడు. మరీ.. తాత ఆనందం కోసం మనవడు పడిన ఆరాటం ఏంటీ ? ఈ క్రమంలో తాత-మనవళ్లు కుటుంబ సభ్యులకి ఇచ్చిన షాకులేంటీ ?? అనేది సరదాగా సాగే మిగితా కథ.
ఎలా ఉందంటే ?
తాతకి క్యానర్. మరో 5వారాలు మాత్రమే బతుకుతాడు. ఇది ఎమోషనల్ పాయింట్. దాన్ని మారుతి తనదైన మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మార్చాడు. ఎమోషనల్ కథని.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భలే చూపించాడు. ఫస్టాఫ్ అంతా నవ్వులే నవ్వులు. చాలా సరదా సరదాగా సాగిపోతుంది. సెకాంఢాఫ్ లో వినోదం తగ్గినా.. ఎమోషన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంది. మొత్తంగా.. వినోదం, ఎమోషన్స్ తో కథని గ్రిప్పింగ్ గా నడిపించాడు మారుతి. తేజు నుంచి మాస్ ని కోరుకునే అభిమానుల కోసం సిక్స్ ప్యాక్ తో యాక్షన్ సీన్ చేయించి మెప్పించాడు.
ఎవరెలా చేశారంటే ?
ఈ కథ కోసం నటీనటుల ఎంపిక చేసుకోవడంలోనే మారుతి సగం సక్సెస్ అయ్యారు. తాతని సంతోషపెట్టే మనవడి పాత్రలో సాయితేజు ఒదిగిపోయాడు. చాలా కొత్తగా కనిపించాడు. ఎమోషన్స్ సీన్స్ లోనూ మెప్పించాడు. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చాడు. సాయితేజ్ తర్వాత రావు రమేష్ పాత్ర సినిమాలో హైలైట్. సెకాంఢాఫ్ లో ఆయన టైమింగ్ అదిరిపోయింది. తాతగా సత్యరాజ్ నటన చాలా బాగుంది. టిక్ టాక్ క్వీన్ రాశీఖన్నా.. పాత్ర యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
థమన్ అందించిన పాటలు బాగున్నాయి. ‘ప్రతిరోజు పండగే’ టైటిల్ సాంగ్ తెరపై చూడ్డానికి అందంగా, ఆహ్లాదంగా ఉంది. ఓ బావా సాంగ్ ని థియేటర్స్ లో డ్యాన్సులే డ్యాన్సులు. ఇక నేపథ్య సంగీతంలో థమన్ మార్క్ చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. రాజమండ్రి లొకేషన్స్ ను అందంగా చూపించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* సాయితేజ్, రావు రమేష్ ల నటన
* వినోదం, ఎమోషన్స్
* సంగీతం
మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్ లో కొన్ని సీన్స్
చివరగా :
‘ప్రతిరోజూ పండగ’ నిజంగానే పండగలా ఉంది. వినోదం, ఎమోషన్స్ పడ్డాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని యూత్ ఎంజాయ్ చేసేలా ఉంది. సంక్రాంతి పండగకి రావాల్సిన సినిమా ముందే వచ్చినట్టుంది.
రేటింగ్ : 3.5/5