అలీ ఇంటికి పవన్ వెళ్లకపోవడానికి కారణాలివే.. !
హాస్య నటుడు అలీ తల్లి జైతున్ బీబీ గురువారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అతని తల్లి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మెగాస్టార్ చిరంజీవి అలీ నివాసానికి వెళ్లారు. అలీ, అతని కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలీ స్నేహితుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కానీ ఆయన నివాసానికి వెళ్లలేదు. దీనిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అలీ-పవన్ ల మధ్య రాజకీయ విబేధాల కారణంగా పవన్ అలీ ఇంటి వెళ్లలేదేమో అనే కామెంట్స్ వినిపించాయి.
ఈ విషాద సమయాన పవన్ అలాంటి విషయాలని పట్టించుకోవడమేంటనే మాటలు వినిపించాయి. కానీ, అలీ మీద ఉన్న ప్రేమ కారణంగానే పవన్ ఆయన ఇంటికి వెళ్లలేకపోయారని తెలిసింది. అలీకి అమ్మంటే పంచ ప్రాణాలు అన్న సంగతి తెలిసిందే. పవన్‌ని చూడగానే అలీ బోరున ఏడ్చేస్తాడు. పవన్ కూడా బాధపడతాడు. వారి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అందుకే పవన్ అలీ ఇంటికి వెళ్లలేదని.. పవన్ సన్నిహితులు చెబుతున్నారు.
దీనికి ఏఎన్నార్ ని ఉదహరణగా చెబుతున్నారు. ఘంటసాల, ఏఎన్నార్ మంచి మిత్రులు. కానీ, ఘంటశాల చనిపోయిప్పుడు అక్కినేని నాగేశ్వరరావు చూడటానికి వెళ్లలేదు. దాంతో అందరూ వీరి మధ్య విభేదాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ, అతని భౌతికకాయాన్ని చూసి ఆయనతో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చి నా ఊపిరి ఆగిపోతే ఎలా? అని ఓ సందర్భంలో ఏఎన్నార్ అన్నారు. ఇప్పుడు పవన్-అలీల బంధం కూడా అలాంటిదే అంటున్నారు.