రేపే ‘అల.. బుట్టబొమ్మ సాంగ్’ !

త్రివిక్రమ్-అల్లు అర్జున్’ల హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అల.. నుంచి వచ్చిన మూడు సాంగ్స్ సూపర్ హిట్టే. సామజవరగమన, రాములో రాములో ఏకంగా రికార్డ్స్ సృష్టించాయి. అత్యధిక వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటలుగా ఒకటి, రెండో స్థానంలో నిలిచాయి.

ఇక ఈ సినిమా నుంచి రావాల్సిన ‘బుట్టబొమ్మ.. ‘ కొన్ని కారణాల వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సాంగ్ టీజర్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం 10గంటలకి బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో బన్నీ సిగ్గుపడుతూ.. ఆయన వైపు పూజా హెగ్డే రొమాంటిక్ గా చూస్తోంది.