‘దిల్లీవాలా..’ సాంగ్ అదిరిపోయింది !

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాషా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. ఇందులో రవితేజ దిల్లివాలా పాత్రలో కనిపించనున్నారు. వచ్చే యేడాది జనవరి 24న డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా నుంచి ‘దిల్లీవాలా.. ‘ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించిన ఈ పాటని గీతా మాధురి, ఆధిత్య ల్యెంగర్ కలిసి ఆలపించారు. నభా నటాషా ఓ భవనంలోకి నడుచుకుంటూ వస్తూ.. అక్కడ టేబుల్ పై ఉన్న డిస్కోరాజా డైరీని ఓపెన్ చేస్తూ.. ‘దిల్లీవాలా’ సాంగ్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు.ఇప్పుడీ సాంగ్ హవా చూపిస్తోంది. ఇప్పటికే మిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకుంది.

దిల్లీవాలా సాంగ్ సూపర్భ్ గా ఉంది. క్లాసికల్ టచ్ తో తమన్ ఇచ్చిన ట్యూన్ ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఓ బాలీవుడ్ సినిమా సాంగ్ ని వింటున్న ఫీల్ కలిగింది. ఈ పాటని రవితేజ, నభా నటాషాలపై చిత్రీకరించారు. కొన్ని సాంగ్ బిట్ సీస్న్, మరికొన్ని మేకింగ్ బిట్ సీన్స్ తో దిల్లీవాలా లిరికల్ సాంగ్ ని వదిలారు