ఫిలిం ఫేర్ అవార్డ్స్’లో రంగస్థలం హవా

66వ సౌత్ ఇండియన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సందీప్ కిషన్ – రెజీనా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఫిల్ ఫేర్ లో ‘రంగస్థలం’ సినిమా హవా చూపించింది.

తెలుగు బెస్ట్ ఆల్భమ్ గా రంగస్థలం నిలిచింది. అంతేకాదు.. బెస్ట్ తెలుగు లిరికల్ సాంగ్ గా ‘ఎంత సక్కగున్నావే.. ‘ పాట నిలిచింది. ఈ పాటని చంద్రబోస్ రాశారు.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి  జంటగా సమంత నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.