సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్  : ఉత్తమ ‘నటుడు రామ్ చరణ్, నటి రష్మిక’ 


66వ సౌత్ ఇండియన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ప్రధానోత్సవ  కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరుగుతోంది. తెలుగు పరిశ్రమకి సంబంధించి ఉత్తమ నటుడు అవార్డు రంగస్థలం సినిమాకుగానూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దక్కింది.

ఇక ఉత్తమ నటిగా రష్మిక మందన నిలిచింది. ‘గీత గోవిందం’ సినిమాకు గానూ రస్మిక ఈ అవార్డు గెలిచింది. ఉత్తమ దర్శకుడిగా ‘మహానటి’ సినిమాకు గానూ నాగ్ అశ్విన్ అవార్డు దక్కింది.

బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా అనసూయ (రంగస్థలం), బెస్ట్ మేల్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా జగపతి బాబు (అరవింద) సమేతకు అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ తెలుగు ఆల్భమ్ గా రంగస్థలం నిలిచింది.


ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ పరిశ్రమకి నటీనటులు తరలివచ్చారు. అదిరిపోయే డ్రెస్సులతో హీరోయిన్స్ మెరిసారు. దీంతో వేదిక కలర్ ఫుల్ గా మారింది.