ఓపెనింగ్ బాలయ్యదే. కానీ.. !


శుక్రవారం బాలయ్య ‘రూలర్’, సాయితేజు ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో పండగ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొంది. పండగ థియేటర్స్ లో నవ్వులే నవ్వులు. వినోదం, ఎమోషన్ పండిన పండగ సినిమా అనీ వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంది. దీంతో పండగ చిత్రబృందం ఆనందంలో ఉంది. హిట్ సెలబ్రేషన్స్ మొదలెట్టింది. ఇక బాలయ్య ‘రూలర్’ రొటీన్ సినిమా అనిపించుకొంది. 

కథ-కథనాలు మరీ నాసిరకంగా ఉన్నాయి. సినిమాలో బాలయ్య నటన ఒక్కటే హైలైట్. అదే తొలిరోజు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. తొలిరోజు రూలర్ కలెక్షన్స్ రూ. 4కోట్ల పైమాటే. అదే హిట్ టాక్ తెచ్చుకొన్న పండగ సినిమా రూ. 4కోట్ల లోపే కలెక్ట్ చేసింది. ఐతే, పాజిటివ్ టాక్ తో పండగ కలెక్షన్స్ రెండోరోజు నుంచి పెరిగే ఛాన్స్ ఉంది. ఇదీ రూలర్ విషయంలో రివర్స్ అయ్యేలా ఉంది. ప్లాప్ టాక్ తో రెండోరోజు నుంచి రూలర్ కలెక్షన్స్ పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి.. ఓపెనింగ్ లో బాలయ్య హిట్. సెంచరీ చేసేది మాత్రం పండగ సినిమాయే.. !