నవ్వుల సినిమాలో విజయశాంతి

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13యేళ్ల తర్వాత మొహానికి మేకప్ వేసుకొన్నారు. కెమెరా ముందుకొచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సరిలేరు షూటింగ్ పూర్తి చేసుకొంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో విజయశాంతి నటించబోతున్న నెక్ట్స్ సినిమా ఏంటన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే విజయశాంతి ఆఫర్లు క్యూ కట్టాయని సమాచారమ్. ఆమె మాత్రం సరిలేరు రిలీజ్ తర్వాతే తన తదుపరి సినిమాపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు వార్గలొచ్చాయ్. ఐతే. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఆమె తన తదుపరి సినిమాగా నవ్వుల సినిమాలో నటించనుంది. అదే ‘ఎఫ్3’. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకుంది.

ఎఫ్ 2 సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతిని అడగటం.. అందుకు ఆమె ఓకే చెప్పడం జరిగిపోయినట్టు తెలుస్తోంది. వెంకీమామ తర్వాత విక్టరీ వెంకటేష్ ‘అసురన్’ రిమేక్ ని పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తవ్వగానే ఎఫ్ 3ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. 2021 సంక్రాంతి కానుకగా ఎఫ్ 3ని ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.