బుట్టబొమ్మ టీజర్ వచ్చేసింది

‘అల.. వైకుంఠపురం’ నుంచి మరోసాంగ్ ‘బుట్టబొమ్మ.. ‘ ఈ నెల 24న (మంగళవారం) రిలీజ్ కానుంది. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటని అమ్రాన్ మాలిక్ పాడారు. థమన్ సంగీతం అందించారు. “బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగికే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే.. ” అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంటోంది. అల.. నుంచి రాబోతున్న నాల్గో సాంగ్ ఇది.

ఇప్పటికే అల.. పాటలు సామజవరగమన, రాములో రాముల రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా సామజవరగమన, దాని తర్వాతి స్థానంలో రాములో రాములో పాట నిలిచింది. ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. రిలీజ్ కానుంది.