సౌత్ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్’ – విన్నర్స్ లిస్టు !

66వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్  ప్రదానోత్సవం శనివారం సాయంత్రం చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సందీప్‌ కిషన్‌, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలలో 2018 సంవత్సరానికి గాను ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు నటీనటులు, టెక్నీషియన్స్‌కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందించారు.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ విన్నర్స్ లిస్టు :  

ఉత్తమ చిత్రం : మహానటి

ఉత్తమ దర్శకుడు : నాగ అశ్విన్‌ (మహానటి)

ఉత్తమ కథానాయకుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)

ఉత్తమ కథానాయకుడు (విమర్శకుల) : దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి)

ఉత్తమ నటి : కీర్తి సురేశ్‌ (మహానటి)

ఉత్తమ నటి (విమర్శకుల) : రష్మిక (గీత గోవిందం)

ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు (అరవింద సమేత)

ఉత్తమ సహాయ నటి : అనుసూయ (రంగస్థలం)

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవే..రంగస్థలం)

ఉత్తమ గాయకుడు : సిద్‌ శ్రీరామ్‌ (ఇంకేం ఇంకేం ఇంకేంకావాలే.. గీతగోవిందం)

ఉత్తమ గాయిని: శ్రేయా ఘోషల్‌ (మందారా మందారా.. భాగమతి)