వేధింపులపై సన్నీ.. స్పెషల్‌ వీడియో  !

పని ప్రదేశాల్లో వేధింపులను సహించకండి అని అంటున్నారు బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ. ఈ మేరకు ఆమ్ ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. పని చేసేచోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి అని సన్నీ లియోనీ పేర్కొన్నారు. మౌనంగా ఉంటే మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సినీనటి సన్నిలియోన్ తోటి మహిళలను హెచ్చరించారు.

సన్నీలియోనీ ప్రస్తుతం ‘కోకో కోలా’ సినిమాలో నటిస్తున్నారు. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దీనితోపాటు ఆమె దక్షిణాదిలో తెరకెక్కనున్న ‘రంగీలా’, ‘వీరమదేవి’ చిత్రాల్లో నటించనున్నారు. మరోవైపు పలు బుల్లితెర రియాల్టీ షోలలో కూడా సన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.