ఎయిర్ టెల్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్
తెలుగు ప్రజలకి ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో వైఫై కాల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.ఏ నెట్ వర్క్ లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచు.. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని ఎయిర్ టెల్ ప్రకటించింది.
ఈ వైఫ్ కాల్స్ సదుపాయాన్ని తొలుత తెలుగు రాష్ట్రాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సదుపాయం పొందేందుకు ఎటువంటి యాప్ అవసరం లేదు. వైఫై కాలింగ్ కు మద్దతిచ్చేలా తాజా వర్షన్ కు ఫోన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకుంటే చాలు. ప్రస్తుతం 6ఎస్ ఆపై వెలుడిన అన్ని యాపిల్ ఫోన్లతో పాటు, శాంసంగ్ జే6, ఏ 10, ఒన్ 10, ఎస్ 10 ప్లస్, ఎస్ 10ఈ, వన్ ప్లస్ 6, 7 సీరీస్ ఫోన్లు, రెడ్ మీ కే 20, కే 20 ప్రో తదితర ఫోన్లన్నీ సపోర్ట్ ఈ వైఫై కాలింగ్ కి సపోర్ట్ చేయనున్నాయి.