కేసీఆర్’తో యుద్ధం వద్దు.. తెలంగాణ బీజేపీ నేతలకి అమిత్ షా వార్నింగ్ ?
తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టిందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇతర పార్టీలోని సీనియర్, కీలక నేతలకి బీజేపీ గాలం వేయడం చూస్తున్నాం. ఇక తెలంగాణలో బీజేపీ బలోపేతానికి స్వయంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన తెలంగాణలోనే పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సరియైన బలం లేకున్నా తెలంగాణ బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గట్టిగానే మాట్లాడుతుంటారు. ఐతే, అలాంటి వారకి తాజాగా అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారమ్.
సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించవచ్చు. ఆయనతో జాగ్రత్తగా వ్యవహిరించమని అమిత్ షా తెలంగాణ భాజాపా నేతలకి సూచించారట. కాదు.. ఆదేశించారట. దాని వెనక వ్యూహాం ఏంటి ? అన్నది తెలియక తెలంగాణ బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలో మంచి సంబంధాలు నడుపుతుంటారు. కేసీఆర్ తలచుకుంటే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకి ప్రత్యామ్నాయ కూటమిని తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ బీజేపీ నేతలకి అమిత్ షా సూచినలు చేసినట్టు చెప్పుకొంటున్నారు.