సీఎం జగన్ డేరింగ్ డిసిషన్


ఏపీ సీఎం జగన్ డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు. తొలిసారి కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ (సీసీఏ) బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన చేశారు. సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ తొలిసారి సీసీఏపై స్పందించారు. ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని.. ముస్లింలకు అండగా ఉంటామని సీఎం జగన్ అన్నారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం తనతో మాట్లాడిన తర్వాతే ప్రకటన చేశారని తెలిపారు.

సీఎం జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా వెల్లడం ఇదే తొలిసారి. ఆయన ముఖ్యమంత్రికాక ముందు అయిన తర్వాత కూడా కేంద్రానికి విధేయుడుగా ఉంటు వస్తున్నారు. అంతేకాదు.. సీఎం జగన్ జుట్టు కేంద్రం చేతిలో ఉంది. ఆయనపై ఉన్న అవినీతి కేసుల నేపథ్యంలో కేంద్రం చెప్పినదానికి సీఎం జగన్ తలూపాల్సిందేననే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పుడా ముద్రని చెరిపేస్తూ.. తొలిసారి కేంద్రానికి వ్యతిరేక ప్రకటన చేశారు సీఎం జగన్. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సీసీఏ పై ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టం చేయకపోయిన సంగతి తెలిసిందే.