బ్రేకింగ్ : దిశ నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగింత
ఎట్టకేలకి దిశ నిందితుల మృతదేహాలని వారి కుటుంబ సభ్యులకి అప్పగించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృత దేహాలకి రీ-పోస్టుమార్టమ్ పూర్తిచేసింది. దాదాపు 4గంటలపాటు పోస్ట్ మార్టమ్ చేశారు. రెండ్రోజుల్లో పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ వైద్యులు హైకోర్టుకు ఇవ్వనున్నారు.
ఇక రీ పోస్టుమార్టమ్ అనంతరం గాంధీ ఆసుపత్రి మృతదేహాలని కుటుంబ సభ్యులకి అప్పగించారు. రెండు అంబులెన్స్‌ల్లో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఈ రోజు సాయంత్రం మృతదేహాలకు వారి బంధువులు అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది. ఎన్ కౌంటర్ జరిగిన రోజునే రాత్రినే దిశ నిందితుల అంత్యక్రియలని నిర్వహించాలని భావించారు. ఐతే, హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియలని నిలిపివేసిన సంగతి తెలిసిందే.