వన్డే సిరీస్ మనదే
కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ (63), కేఎల్ రాహుల్ (77) పటిష్టమైన పునాది వేయగా, ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (85) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (39 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 పరుగులు) కలిసి పని పూర్తి చేశాడు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కాయి. దీంతో మూడు వన్ డేల సిరీస్ ని టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది.