నిర్మాతలకి పండగే !
నవ్వులు పంచిన సినిమా నిరాశపరచదని చెబుతుంటారు. ఇప్పుడు ‘పడి పడి నవ్వుతుండగా.. ప్రతి థియేటర్ లోనూ పండగ’ జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులు పండగ సినిమాని చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వినోదం, ఎమోషన్స్ పండిన పండగ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు పండగ సినిమాకి బాగా కలిసొచ్చాయ్. అంతేకాదు.. పండగ సినిమా భారీ లాభాలు తీసుకొచ్చేలా కనిపిస్తొంది. మొత్తం పాతిక కోట్లలో పండగ సినిమాని తీసుకొచ్చారు. ఇందులో దర్శకుడు మారుతి రెమ్యూనిరేషన్ ఆరుకోట్లు, ఆపైన హీరో రెమ్యూనిరేషన్ నే పెద్దది. ఐతే, శాటిలైట్, డిజిటల్, హిందీ అన్నీ కలిపి 16 కోట్లు రాబట్టేసారు. ఓవర్సీస్, కర్ణాటక, విశాఖ, సీడెడ్, నెల్లూరు కలిపి ఏడు కోట్ల వరకు అమ్మేసారు.
అడియో రైట్స్ మీద 70 లక్షల వరకు వచ్చింది. అంటే దాదాపు వీటితోనే దగ్గర దగ్గర సేఫ్ అయిపోయారు. నిర్మాతలకు ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, కీలకమైన నైజాం మిగిలాయి. ఈ ఏరియాలే అన్నీ కలిపి తక్కువలో తక్కువ 10 కోట్లకుపై పైగా వస్తాయని అంచనా వేస్తున్నారు. లాభాల్లో యువి వంశీ, గీతా బన్నీవాస్, అల్లు అరవింద్ లకు వాటాలు వున్నాయి. దీంతో నిర్మాతలకి పండగే అని తెలుస్తోంది.