పూరికి రమ్యకృష్ణ 50లక్షల డిస్కౌంట్
దర్శకుడు పూరి జగన్నాథ్ కి నటి రమ్యకృష్ణ రూ.10లక్షల డిస్కౌంట్ ఇచ్చింది. పూరి తనయుడు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్. ఛార్మితో కలిసి పూరి నిర్మిస్తున్నారు.
బాహుబలి తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దాదాపుగా దక్షిణాది అన్నీ బాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె రోజుకు రూ. 10 నుంచి 15లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఐతే, రొమాంటిక్ సినిమాకి మాత్రం 20రోజుల కాల్షీట్లు ఇచ్చినా.. రూ. 50లక్షలు మాత్రమే తీసుకుందట. ఈ లెక్కన ఆమె పూరి రూ. 50లక్షల డిస్కౌంట్ ఇచ్చింది. కృష్ణవంశీతో పూరికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయనకి డిస్కౌంట్ ఇచ్చిందని తెలుస్తోంది. కృష్ణవంశీ, పూరి ఇద్దరు రామ్ గోపాల్ వర్మ శిష్యులే అన్న సంగతి తెలిసిందే.
ఇక పూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాలోనూ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నారు. ఫైటర్ ని ప్యాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫైటర్ ని బాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంగీకరించినట్టు సమాచారమ్. ఈ చిత్రంలో విజయ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోనున్నారు.