సరిలేరు ఆథమ్ వచ్చేసింది !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా నుంచి ప్రతి సోమవారం ఓ పాటని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం సరిలేరు టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు. పాట అద్భుతంగా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు.. నీవెళ్లే రహదారికి జోహారు’ అంటూ సైనికుడిని గొప్పదనాన్ని అద్భుతంగా వినిపించారు.ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించారు. శంకర్ మహాదేవన్ పాడారు. కంప్లీట్ గా సాంగ్ మేకింగ్ సీన్స్ తో సరిలేరు ఆథమ్ ని వదిలారు. దేశ భక్తిని రగిలించేలా.. సైనికుడిపై మరింత గౌరవం పెరిగేలా సాగింది. ఆ సాంగ్ ని మీరు ఓ సారి వినేయండీ.. !