ఇలా కనిపించొద్దు.. సామ్ !

స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో చేయలేదు. చాలా పద్దతిగా కనిపించేది. అందాల ప్రదర్శనతో కాకుండా అద్భుతమైన నటనతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో రాణిస్తోంది. 
ఐతే, గతంలో కాస్త క్లీవేజ్ షోతో ఉన్న ఓ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది సినిమాలోని పిక్ కాదు. బయట తీసిన పిక్. ఇందులో సామ్ హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఈ పిక్ ని చూసిన సామ్ అభిమానులు.. ఇలా కనిపించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

ఇక ఈ యేడాది ‘మజిలీ’తో హిట్ కొట్టిన సామ్. 96 తెలుగు రిమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇందులో సామ్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారమ్. ఇక, పరుశురామ్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించనున్న సినిమాలోనూ సామ్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.