మహా ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ 

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు థ్రిల్లర్ సినిమాని తలపించిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐతే, ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు.

మంగళవారమే మహా మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. ఐతే, మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఓ అవగాహన కుదరలేదు. దీంతో మహా మంత్రివర్గ విస్తరణ ఈ నెల 30కి వాయిదా పడింది. ఇక మహా ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎన్సెపీకి హ్యాండిచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యూటర్న్ తీసుకొని.. ఎన్సీపీ దారిలోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయనకి ఉప ముఖ్యమంత్రి వరించనుంది.