ఆసీస్ వన్డే జట్టుకు కెప్టెన్’గా ధోనీ

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఆసీస్ వన్డే జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఈ దశాబ్దపు ఆసీస్ వన్డే, టెస్ట్ క్రికెట్ జట్లని సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా) ప్రకటించింది. వన్డే జట్టుకు ధోనీని కెప్టెన్ గా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ధోనీతో పాటు టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ ఆసీసీ జట్టులో ఉన్నారు.

ఇక ఈ దశాబ్ధపు ఆసీస్ టెస్ట్ జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం దక్కింది. ఆయనకే కెప్టెన్ పగ్గాలు అప్పగించారు. టెస్ట్ జట్టులో భారత్ నుంచి కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఇక ఆసీస్ జట్టు నుంచి కేవలం మిచెల్‌ స్టార్క్‌ మాత్రమే చోటు దక్కింది.

2010-2019 సీఏ వన్డే జట్టు : ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగా.

2010-2019 సీఏ టెస్టు జట్టు : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లయన్‌, జేమ్స్‌ అండర్సన్‌