గుడ్ న్యూస్ : ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల సంఘాల మాటలు విని కార్మికులు తమ ఉద్యోగాలు పోగొట్టుకొని స్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారికి అండగ ఉంటూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్మికులని తిరిగి విధుల్లోకి తీసుకొనేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.100కోట్లు విడుదల చేశారు. అంతేకాదు.. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుంటుంబాలని ఆదుకుంటామని హామి ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం వారికి ఉద్యోగాలు ఇచ్చారు. తాజాగా ఆర్టీసీ కార్మికులకి సీఎం కేసీఆర్ మరో తీపి కబురు చెప్పారు. పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి పెంచారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. అంతేకాదు.. మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీ, ప్రసూతి సెలవులు, రిటైర్మెంట్ వయసు పెంపు అంశాలపై కూడా హామీ ఇచ్చారు. దాని అనుగుణంగానే ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.