‘హిట్’ ఫస్ట్ లుక్

హీరోగా నేచురల్ స్టార్ నాని సూపర్ హిట్ అయ్యాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకొన్నాడు. యేడాది ఒక్క సినిమా చేయడానికే స్టార్ హీరోలు కిందా మీద పడుతుంటే.. నాని మాత్రం యేడాదికి మూడ్నాలుగు సినిమాలు చేస్తున్నాడు. విజయాలు అందుకుంటున్నాడు. హీరోగా హిట్ అయిన నాని.. నిర్మాతగానూ హిట్ కావాలని ఆశపడుతున్నాడు.

‘వాల్‌పోస్టర్’ అనే బ్యానర్ ని స్థాపించిన నాని.. ఈ బ్యానర్ లో తొలి సినిమాగా `అ!` లాంటి వైవిధ్యమైన సినిమా చేశాడు. అ ! మంచి సినిమా అనిపించుకొంది. కమర్షియల్ గానూ ఆడింది. అ ! తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నాని నిర్మాత రెండో సినిమాని తీసుకొస్తున్నారు. ‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్‌ విశ్వక్‌సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా బుధవారం ‘హిట్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. 

ఫస్ట్ లుక్ లో విశ్వక్ సేన్ స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ విక్రమ్ రుద్రరాజు అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి1న హిట్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.