రివ్యూ : ఇద్దరిలోకం ఒకటే – వారిలోకంలోకి వెళ్లకపోవడమే మంచిది

చిత్రం : ఇద్దరిలోకం ఒకటే (2019)

నటీనటులు : రాజ్ తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి తదితరులు

సంగీతం : మిక్కీజే మేయర్

దర్శకత్వం : జీఆర్ కృష్ణ

నిర్మాత : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 25డిసెంబర్, 2019

రేటింగ్ : 2/5

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘కుమారి 21ఎఫ్’ సినిమాలతో విజయాలు అందుకొన్నాడు. కుర్రాడిలో ఎనర్జిని చూసి.. టాలీవుడ్ కి మరో మినిమమ్ గ్యారెంటీ హీరో దొరికాడు అనుకొన్నారు. రవితేజ వారసొచ్చాడని చెప్పుకొన్నారు. కానీ, కుర్రాడికి కాలం కలిసిరాలేదు. వరుస ప్లాపులతో డీలా పడిపోయాడు.

ఈ నేపథ్యంలో కుర్రాడికి దిల్ రాజు బ్యానర్ లో సినిమా పడింది. అదే ఇద్దరిలోకం ఒకటే. షాలినీ పాండే కథానాయిక. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇద్దరిలోకం ఒకటే ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

వర్ష (షాలినీ పాండే)కి తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మంచి నటి అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. మహి (రాజ్ తరుణ్) తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ గా ఎదుగుతాడు. ఓ సందర్భంలో తన తండ్రి గుర్తుగా ఆయన తీసిన ఫోటోలన్నంటిని ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫోటోల్లో వర్ష చిన్ననాటి ఫోటో ఒకటి కనిపిస్తుంది. అది చూసిన హర్ష మహికి దగ్గరవుతోంది. ఫైనల్ గా వీరి ఇద్దరిలోకం ఒకటే ఎలా అయింది ? వీరి ఫ్యాష్ బ్యాక్ ఏంటీ ?? అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

* రాజ్ తరుణ్, షాలినీ పాండేల నటన

మైనస్ పాయింట్స్

* కొత్తదనం లేని కథ

*  ఇది వరకే సినిమాల్లో వాడేసిన సీన్లు

* స్లో నేరేషన్

* సంగీతం

ఎలా ఉందంటే ?

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గొప్ప ప్రేమకథగా ‘ఇద్దరిలోకం ఒకటే’ సినిమాని తెరకెక్కిద్దామనే ప్రయత్నం చేశాడు దర్శకుడు జీఆర్ కృష్ణ. ఐతే, ఆ ప్రయత్నం అట్టర్ ప్లాప్ అయింది. ఆయన రాసుకొన్న ఏ ఒక్క సీన్ కొత్తగా అనిపించదు. రాత మాత్రమే కాదు తీత కొత్తగా అనిపించదు. దాంతో ప్రేక్షకుడు కథకి కనెక్ట్ కాలేదు. ఇలాంటి కథని దిల్ రాజు బ్యానర్ లో రావడం ఆశ్చర్యాన్ని కలిగించేది. బహుశా.. కథని గొప్పగా చెప్పిన దర్శకుడు.. దాన్ని తెరపైకి తీసుకురావడంలో విఫలం అయి ఉంటాడు.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటనకి వంకపెట్టలేం. మంచి కథ పడితే.. అద్భుతంగా నటించగలడు. షాలినీ పాండే అంతే. అర్జున్ రెడ్డిలో ఆమె నటని చూశాం. వీరిద్దరు నటనతో మెప్పించారు. కానీ, కథ, కథనం బాగులేనప్పుడు ఎంత మంచి నటులు ఉన్న వేస్ట్ నే కదా. ఇద్దరిలోకం ఒక్కటే సినిమా విషయంలోనూ అదే జరిగింది. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

ఒకట్రెండు పాటలు బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. స్లో నేరేషన్ ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టేలా ఉంది. చాలా సన్నివేశాలకి కత్తెరపెట్టొచ్చు. ఒకసన్నివేశానికి మరో సన్నివేశానికి లింకు మిస్సవడం పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఇద్దరిలోకం ఒకటే.. వారిలోకంలోకి వెళ్లకపోవడమే మంచిది

రేటింగ్ : 2/5