ఉమామహేశ్వర ఉగ్రరూపం చూశారా.. ?

‘c/o కంచరపాలెం’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకొన్నాడు వెంకటేష్ మహా. ఆయన నుంచి వస్తున్న మరో సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ.. ఓ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. సత్యదేవ్‌తో పాటు సీనియర్‌ నటుడు నరేశ్‌ ఇందులో కనిపించారు. ‘చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను’ అంటూ హీరో సమాధానం ఇస్తాడు. ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. ఒక్క సీన్ లోనే ఉమామహేశ్వర ఉగ్రరూపం చూపించారు.  ఈ సినిమా 2020, ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.