ఆకాష్ పూరి పేరుతో అమ్మాయిలని మోసం.. !

దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పేరిట ఓ మహిళని మోసం పోయింది. ఇంకా చెప్పాలంటే.. ఇది ఆన్ లైన్ మోసం. ఆకాష్ పూరి పేరిట నకిలీ ఖాతా తెరిచిన ఓ యువకుడు చాలామంది యువతులని వలలో వేసుకొన్నాడు. వీరిలో ఓ అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో.. యువకుడి బాగోతం బట్టబయలు అయింది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన రొమాంటిక్ తొలి సాంగ్ కి మంచి స్పందన దక్కింది.