ఏపీ కేబినేట్ భేటీ.. వేదిక మార్పు ?

రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినేట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో భద్రతని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. తొలుత సచివాలయంలోనే మంత్రివర్గం భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ.. రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక మంత్రివర్గ భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపైనా చర్చించే అవకాశముంది. దాంతో పాటు సీఆర్డీయే ప్రభుత్వం భూములని పొందిన ఐపీఎస్, ఐఏస్ అధికారులకి తిరిగి డబ్బులు ఇచ్చే అంశాన్ని కేభినేట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారమ్. ఇక రేపు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటన చేసిన నేపథ్యంలో ఎల్లుండి సీఎం జగన్ వైజాగ్ పర్యటనకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో సీఎంకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.