ఈ దశాబ్ధపు ఆఖరి సూర్య గ్రహణం.. మిస్ కాకండీ !

ఆకాశ వీధిలో ఓ అద్భుతం కనువిందు చేస్తోంది. ఆ అద్భుతానికి చూడ్డానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అదే పాక్షిక సూర్య గ్రహణం. ఈ ఉదయం 8:05 గంటలకి సూర్య గ్రహణం ప్రారంభం అయింది. ఉదయం 11:18గంటల వరకు కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్”గా పిలుస్తారు. రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 44 సెకన్ల పాటు కనిపించనుంది.

యేడాదిలో ఐదు సూర్య గ్రహనాలు రావడం చాలా అరుదు. ఈ యేడాదిలో ఇది ఐదో సూర్యగ్రహణం. ఈ దశాబ్ధంలోనే ఆఖరి సూర్య గ్రహణం ఇది. 1935లో ఐదు సూర్య గ్రహానాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. ఇలాంటి సూర్య గ్రహణం మళ్లీ చూడాలంటే 2035 వరకు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజా సూర్య గ్రహణంలో భూమికి అత్యంత దూరంగా ఉండటంవల్ల సూర్యుడిని చంద్రు డు పూర్తిగా కప్పివేయడు. దీంతో సూర్యుడి అంచు చంద్రుడి చుట్టూ ఓ వలయంలా కనిపించనున్నది. దీన్నే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ (అంగుళీయక సూర్య గ్రహణం) పిలుస్తారు. సూర్యగ్రహణాన్ని గ్రహణ వీక్షణ కండ్లద్దాలు, 14 నంబర్‌ వెల్డర్‌ కండ్లద్దాలు, నల్లటి పాలిమర్‌ కోట్‌ చేసిన ఫిల్మ్‌లు, చిన్న రంధ్రం చేసిన కాగితం/కార్డ్‌బోర్డ్‌ గుండా గ్రహణాన్ని వీక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు.