సూర్యగ్రహణం రోజున మూడనమ్మకం.. బాలుడి ఖననం !

ఆధునిక సమాజంలోనూ మూఢనమ్మకాలు కొనసాగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈరోజు ఆకాశ వీధిలో అద్భుతమైన ఘటన చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే. అరుదైన సూర్యగ్రహణం ప్రపంచం వీక్షించింది. ఐతే, సూర్యగ్రహణం రోజున కొన్ని మూఢ నమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక విజయాపూర్ జిల్లాలో ఓ వింకలాంగ బాలుడిని తల్లిదండ్రులు బురదలో పాతిపెట్టారు. ఇలా చేస్తే బాలుడి అవిటితనం పోతుందన్నది వారి నమ్మకం.

బురడలో ఖననం చేసిన ఆ బాలుడు ఏడుస్తున్న.. కనీళ్లు తూడుస్తున్నారు తప్ప.. బయటికి తీరడంలేదు. దీంతో ఆ బాలుడు బాధతో విలపించాడు. ఇక తెలంగాణ జనగాం జిల్లాలో పల్లెంలో నూనె పోసి రొకలిని నెలబెట్టారు. సూర్యగ్రహణం రోజునే ఇలా పల్లెంలో రోకలు నిలబడుతుందని చెబుతున్నారు.

ఇక తాజా సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యేడాది లో ఐదు సూర్యగ్రహణాలు ఏర్పడటం చాలా అరుదు. ఈ యేడాది ఏర్పాడిన ఐదో సూర్యగ్రహణం ఇది. ఈ గ్రహణాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్”గా పిలుస్తారు. రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 44 సెకన్ల పాటు కనిపించనుంది. సూర్య గ్రహణంలో భూమికి అత్యంత దూరంగా ఉండటంవల్ల సూర్యుడిని చంద్రు డు పూర్తిగా కప్పివేయడు. దీంతో సూర్యుడి అంచు చంద్రుడి చుట్టూ ఓ వలయంలా కనిపించనున్నది. దీన్నే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ (అంగుళీయక సూర్య గ్రహణం) పిలుస్తారు.