చిరు152 రెగ్యూలర్ షూటింగ్’కు లైన్ క్లియర్

మెగాస్టార్ చిరంజీవి 152 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డేటు ఫిక్సయింది. జనవరి 2 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలెట్టనున్నారు. వాస్తవానికిగతంలో 2 సార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. దానికి కారణం. చిరంజీవి లుక్ ఫైనల్ కాకపోవడమే.

ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండాలనే అంశంపై కొరటాల చాలా కసరత్తులు చేశాడు. ఫైనల్ గా చిరంజీవి లుక్ టెస్ట్ ముగిసింది. అన్నపూర్ణ స్టుడియోలో చిరంజీవిపై నిర్వహించిన ఫొటోషూట్ లో అతడి లుక్ ను ఫిక్స్ చేశారు. దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది. జనవరి2 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం ఎలిమెంట్ తో ఈ సినిమా రాబోతోంది. కాకపోతే ఇది ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తుంది. సినిమాలో చిరు దేవదాయ శాఖ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. ఆయనకి జంటగా త్రిష నటించనుంది. మణిశర్మను సంగీతం అందించనున్నారు. ఆయన ఇప్పటికే పని మొదలెట్టారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పాత్రలో మెరసే అవకాశాలున్నట్టు సమాచారమ్.