మౌనం వీడిన కన్నా .. ఏమన్నారంటే ?

ఏపీ రాజధాని విషయంలో భాజాపాలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఏపీకి మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన తర్వాత మాట్లాడిన బీజేపీ నేత జీవీఎల్.. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. అధికారిక వికేంద్రణకి భాజాపా మద్దతు ఇస్తుందన్నారు. ఐతే, ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా తదితరులు ఏపీకి మూడు రాజధానులని అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు.

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఉదయం ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణఉద్దండరాయనిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కొద్దిసేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.