సరిలేరు ఐటమ్ అదిరిపోయింది !

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దేవి ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. సరిలేరు కోసం దేవి తనదైన శైలిలో ఓ ఐటమ్ ట్యూన్ రెడీ చేశారు. ఈ పాటలో మహేష్ తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా చిందేసింది. 
దానికి సంబంధించిన ప్రోమోని విశాఖ ఉత్సవ్ లో రిలీజ్ చేశారు. #DaangDaang అంటూ సాగే… ఐటమ్ అదిరిపోయింది. మహేష్ తో కలిసి మిల్కీ బ్యూటీ ఊఫేసింది. ఈసారి మహేష్ అదిరిపోయే స్టెప్స్ వేశాడు. తమన్నాతో పోటీ పడుతూ కాలు కదిపాడు. కచ్చితంగా ఈ ఐటమ్ అస్త్రం సరిలేరుకు ప్లస్ కానుంది. ఇక #DaangDaang శనివారం సాయంత్రం నుంచి ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. దాన్ని బట్టీ అర్థమవుతోంది. #DaangDaang ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది. ఇప్పుడా సమయం వచ్ఛేసింది. #DaangDaang  ప్రోమోని చూసేయండీ.. !