ఉపాధ్యాయునిగా మారిన హరీష్ రావు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయునిగా మారారు. క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థులకి పాఠాలు చెప్పారు. శనివారం మంత్రి హారీష్ రావు సంగారెడ్డి జిల్లాలోని కంది జిల్లా పరిషత్ పాఠశాలకి వెళ్లారు. మధాహ్న భోజనం ఎలా పెడుతున్నారని తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి క్లాసు రూమ్ లోకి వెళ్లారు.

విద్యార్థుల ప్రతిభని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. విద్యార్థులని పిలిచి బోర్డ్ పై కొన్ని తెలుగు పేర్లు రాయమని కోరారు. తెలుగు పేర్లు కూడా సరిగ్గా రాయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు ఎక్కాలు కూడా సరిగ్గా చెప్పడం లేదని.. ఇలా అయితే.. ఎలా పదో తరగతి పాస్ అవుతారని ఉపాధ్యాయులని ప్రశ్నించారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి… వారు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.