అయ్యర్, శివమ్ దూబెపై చర్యలు.. ఎందుకంటే ?
టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె చిక్కుల్లో పడ్దారు. వీరిద్దరిపై చర్యలు తీసుకొనేందుకు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) సిద్ధమవుతోందని సమాచారమ్. రైల్వేస్ తో జరిగిన రంజీ పోరులో ముంబయి 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అయ్యార్, దూబె ఆడలేదు. విశ్రాంతి తీసుకొన్నారు. ఐతే, వీరిద్దరు ఎవరి అనుమతి లేకుండానే విశ్రాంతి తీసుకోవడంతో ఎంసీఏ సీరియస్ అయింది.
ఎవరి సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారని అయ్యర్, దూబెలని ప్రశ్నించగా సెలక్టర్లని వారిద్దరూ సమాధానం ఇచ్చారట. ఐతే బీసీసీఐ, సెలక్టర్లు, ఫిజియో.. ఎవరి నుంచీ తమకు సమాచారం అందలేదని ఎంసీఏ అధికారులు చెబుతున్నారు. సొంతంగా నిర్ణయం తీసుకొని బోర్డు పరువు తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయ్యర్, దూబెలపై చర్యలు తీసుకోవడానికి ఎంసీఏ రెడీ అవుతోంది.