టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే.. !

శనివారం తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం అయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు ను పాలక మండలి నియమించింది.

* వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనానికి నిర్ణయం

* జమ్మూకాశ్మీర్‌, వారణాసిలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం

* ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు

* యేసయ్య కథనంపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయం

* 2019-20 ఏడాది బడ్జెట్‌ను రూ.3,166.25 కోట్ల నుంచి రూ.3,243.19 కోట్లుగా సవరణ

*  బర్డ్‌ ఆస్పత్రి డైరెక్టర్‌గా మదన్‌ మోహన్‌రెడ్డిని నియామకం

*  సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం దిశగా కార్యాచరణ

* గొల్లమండపం మార్చేది లేదని స్పష్టత