విజయ్ సినిమాని కొనేసిన మహేష్

తమిళ సూపర్ స్టార్  విజయ్ సినిమాని మహేష్ భారీ రేటుకి కొనేశారు. ఇక్కడ మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు. నిర్మాత మహేష్ కోనేరు. విజయ్ గత సినిమా ‘విజిల్’ని తెలుగులో రిలీజ్ చేసింది ఇతదే. విజిల్ మహేష్ కి మంచి లాభాలని తెచ్చిపెట్టింది. తాజాగా ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా తెలుగు రైట్స్ ని మహేష్ కోనేరు రూ. 8.75కోట్లకి కొనేసినట్టు సమాచారమ్.

విజిల్ సినిమాను విడుదల చేయడంలో, ప్రమోట్ చేయడంలో మహేష్ కోనేరు వర్క్ నచ్చడంతో విజయ్ ఓ మాట సాయం చేసినట్లు తెలుస్తోంది. విజయ్-లోకేష్ ల సినిమాకు అనిరుధ్ సంగీత అందిస్తున్నారు. మాళవిక మోహనన్ కథనాయిక. ఈ సినిమా టైటిల్ ను సంక్రాంతికి అనౌన్స్ చేస్తారు.  ప్రీ సమ్మర్ టైమ్ లో సినిమాని విడుదల చేయనున్నారు.